దుష్ప్రచారాలు వ్యాప్తి చేయవద్దు.
-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
-సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న దుష్ప్రచారాలపై పత్రిక ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్.
జనం వాయిస్,పెద్దపల్లి,డిసెంబర్-05:
సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నట్లు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు తనకు అందలేదని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.రామగిరి మండలం పెద్దంపేట గ్రామ సర్పంచ్ ఎన్నికల విషయం లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు దుష్ప్రచారాలు సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేస్తున్నారని దీనిని నమ్మవద్దని కలెక్టర్ తెలిపారు.పెద్దంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి చింతపట్ల సుహాసిని దాఖలు చేసిన నామినేషన్ ను తిరస్కరించిన, కలెక్టర్ మరియు ఎలక్షన్ అధికారులపైన తెలంగాణ హై కోర్టు ను ఆశ్రయించగా,వాదనలు విన్న గౌరవ హై కోర్టు నామినేషన్ ను అనుమతించమని తనను ఆదేశించిందని తప్పుడు వార్తలు వస్తున్నాయని హైకోర్టు నుంచి ఇప్పటివరకు తనకు ఎటువంటి ఆదేశాలు అందలేదని కలెక్టర్ పేర్కొన్నారు.పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మొదటి విడత పోలింగ్ జరిగే మండలాలలో నేడు పర్యటించడం జరిగిందని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎటువంటి కోర్టు ప్రొసీడింగ్స్ కు హాజరు కాలేదని, జిల్లా కలెక్టర్ , పంచాయతీ ఎన్నికల విషయంలో అసత్య ప్రచారాలు వ్యాప్తి చేసే వారిపట్ల కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు ఎవరు తప్పుడు వార్తలు వ్యాప్తి చేయవద్దని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments