ప్రజావాణి కార్యక్రమం రద్దు.-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
జనం వాయిస్, పెద్దపల్లి, ఫిబ్రవరి 01:
కలెక్టరేట్లో సోమవారం నాడు (02.02.2026) నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్ కు రావద్దని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికలు మాడల్ కోడ్ అమలులో ఉన్నందున అధికారులంతా క్షేత్రస్థాయిలో ఎన్నికల విధులలో ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు, పురపాలక ఎన్నికల అనంతరం ప్రజావాణి నిర్వహణపై మరోసారి పత్రిక ప్రకటన విడుదల చేస్తామని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments