రూపారెడ్డి హత్య కేసులో వీడిన మిస్టరీ!
జనం వాయిస్, నల్లగొండ, ఆగస్ట్ 19:
తెలంగాణ రాష్ట్రంలో సంచారం సృష్టించిన నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జేబీ కాలనీలో నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ కె. రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. హత్య కేసులో కొన్ని విస్తుపోయే విషయా లు వెలుగులోకి వచ్చాయి, ఈ నెల 11న తన ఇంట్లోనే ఆమె దారుణ హత్యకు గురైన విషయం పాఠకులకు తెలిసిందే.
ఆమె నిర్వహిస్తున్న పాఠశాలలో 10వ తరగతి చదువు తున్న ఇద్దరు విద్యార్థులు రూపా రెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.డబ్బుల కోసమే ఈ ఘాతకాని కి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించా రు. ప్రస్తుతం ఇద్దరినీ అదుపులోకి తీసు కొని విచారిస్తున్నారు.
ఈనెల 11న కొండ మల్లేపల్లి మండలం లోని వేర్వేరు తండాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు మాస్కులు, హుడి ధరించి రూపా రెడ్డి ఇంటి వద్దకు వెళ్లారు ఒక విద్యార్థి ఇంట్లోకి వెళ్లి డబ్బులు ఇవ్వా లని బెదిరించగా ఆమె ప్రతిఘటించా రు. ఆ తోపులాటలో మాస్క్ ఊడిపోవడం తో విద్యార్థిని గుర్తించి ఆమె కేకలు వేసింది
తనను గుర్తుపట్టడం తో వెంట తీసుకెళ్లిన కత్తితో రూపారెడ్డిని హత్య చేశాడు. అనంతరం ఇంట్లో ఉన్నరూ”2.20 లక్షలు తీసుకుని బయట ఉన్న మరో విద్యార్థికి 40 వేలు ఇచ్చారు. ఇద్దరు విద్యార్థులు చోరీలు చేస్తూ జల్సాలకు అలవాటు పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments