EPAPER
Tuesday, November 10, 2026
- Advertisment -spot_img

అడ్మిషన్ల కోసం అసత్య ప్రచారాలు చేస్తున్న వాణి స్కూల్ యజమాన్యం!

📰 Generate e-Paper Clip

అడ్మిషన్ల కోసం అసత్య ప్రచారాలు చేస్తున్న వాణి స్కూల్ యజమాన్యం!

– బిజెపి నేత మోలుమూరి శ్రీనివాస్.

జనం వాయిస్, రామగిరి, మే 14:

రామగిరి మండలం సెంటినరీ కాలనీలో సింగరేణి యాజమాన్య సహకారంతో నిర్వహించబడుతున్న వాణి స్కూల్ యాజమాన్యం గత సంవత్సరం 2025 విద్యార్థులు సాధించిన మెరిట్ లిస్టు ఫ్లెక్సీ లపై ప్రదర్శించి ఈ సంవత్సరం 2026వ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన వాణి స్కూల్ యాజమాన్యం అని అసత్య ప్రచారం చేస్తూ కార్మికుల తల్లిదండ్రులను, సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజలను మోసం చేస్తూ అడ్మిషన్ల కోసం అసత్య ప్రచారం చేస్తుందని, SC,ST విద్యార్థులకు 25% సీట్లు కేటాయించాలని నిబంధన ఉన్నా కూడా స్కూల్ యాజమాన్యం పట్టించుకోకుండా అత్యధిక ఫీజులు వసూలు చేస్తుందని బిజెపి నేత మాజీ, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మోలుమూరి శ్రీనివాస్ ఆరోపించారు. అంతేకాక స్కూలు యజమాన్యం పిల్లలకు ఉండవలసిన వసతులు , పిల్లలకు టాయిలెట్లు, గ్రౌండ్ ప్రహరీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదని స్కూల్లో సరైన అధ్యాపకులు లేరని, నామమాత్రంగా స్కూలు నిర్వహిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు సింగరేణి మేనేజ్మెంట్ ఇట్టి విషయాలపై సమగ్ర విచారణ జరిపించి వాణి స్కూల్ లీజుని ఇతరులకు ఇచ్చి స్కూలు అభివృద్ధికి పాటుపడాలని లేదా సింగరేణి యాజమాన్యమే చొరవ తీసుకొని CBSC సిలబస్ ప్రారంభించాలని ఆయన అన్నారు. ఇట్టి విషయాలు అన్నిటిపై సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ గారికి, సింగరేణి C&MD  గారికి లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు ఆయనతోపాటు తీగల శ్రీధర్, పరంకుశం చారి, మేరుగు శ్రీకాంత్, దొంతుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!