15 ఓవర్లు వర్షార్పణం..35 ఓవర్లకు మ్యాచ్ కుదింపు.
జనం వాయిస్ దినపత్రిక:
పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ కు వర్షం తీవ్ర అడ్డంకిగా మారింది. 11 ఓవర్లకు వర్షం ప్రారంభం కాగా దాదాపు గంటన్నర సేపు గ్రౌండ్ స్టాప్ సిబ్బందితో ఓ ఆట ఆడుకుంది. పడుతూ.. ఆగుతూ.. గ్రౌండ్ స్టాప్ ను పరుగులు పెట్టించింది. చివరకు వర్షం పూర్తిగా నిలిచిపోవడంతో.. అంపైర్లు మైదానంలోకి వచ్చి.. పిచ్, గ్రౌండ్ ను పరిశీలించి మ్యాచ్ నిర్వాహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే 50 ఓవర్ల మ్యాచును 35 ఓవర్లకు కుదించారు. మరికొద్ది సేపట్లో మ్యాచ్ తిరిగి ప్రారంభం కానుంది.ఇదిలా ఉంటే వర్షానికి ముందు టీం ఇండియాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణిస్తారు అనుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వెంట వెంటనే అవుట్ అయ్యారు. వీరితో పాటు కెప్టెన్ శుభ్ మాన్ గిల్ కూడా అవుట్ కావడంతో కేవలం 8.1 ఓవర్లకు 3 కీలక వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఉన్నారు. ఇప్పటికే 11 ఓవర్లు పూర్తి కాగా మిగిలిన 24 ఓవర్లలో భారత జట్టు ఎంత స్కోర్ చేస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments