EPAPER
Thursday, April 2, 2026
Google search engine

దుబాయిలో ప్రముఖ పెట్టుబడిదారులతో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సమావేశం.

📰 Generate e-Paper Clip

దుబాయిలో ప్రముఖ పెట్టుబడిదారులతో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సమావేశం.

జనం వాయిస్ దినపత్రిక, పెద్దపల్లి:

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ దుబాయ్‌లో ప్రముఖ పెట్టుబడిదారులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా వంశీకృష్ణ తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలు పారిశ్రామిక పెట్టుబడుల కోసం అత్యంత అనుకూలమైన ప్రాంతాలని వివరించారు. బొగ్గు, విద్యుత్, రైల్వే, రోడ్లు వంటి మౌలిక వసతులు ఉన్న ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు పెడితే వేలాది మందికి ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని తెలిపారు.అలాగే గనులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్యుత్ ఉత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్, ఎడ్యుకేషన్ మరియు హెల్త్ సెక్టార్‌లలో పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ వ్యాపార వర్గాలను ఆహ్వానించారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులతో సహకారం కొనసాగిస్తామని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!