EPAPER
Tuesday, February 17, 2026
Google search engine

మంథని పోలీస్ స్టేషన్ లో రక్తదాన శిబిరం.

📰 Generate e-Paper Clip

మంథని పోలీస్ స్టేషన్ లో రక్తదాన శిబిరం.

జనం వాయిస్, మంథని:

పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మంథని పోలీస్ స్టేషన్లో మంథని, గోదావరిఖని 2 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ పాల్గొని,గోదావరిఖని ఏసీపీ రమేష్ తో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.ప్రజలు పోలీస్ సేవలను వినియోగించుకోవాలని అన్నారు.యువత సొసైటీ కి ఉపయోగపడే విధంగా పనిచేయాలని శాంతిభద్రత విషయంలో యువత పాలుపంచుకోవాలని కోరారు.రక్తం అనేది జీవితాలను కాపాడడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.వీధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలను గుర్తు చేస్తూ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.డ్యూటీలో అమరులైన పోలీసుల సేవలు గుర్తుంచుకోవాలని అన్నారు.అనంతరం రక్తదానం చేసిన దాదాపు 150 మందికి సర్టిఫికెట్స్ అందజేశారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా సిఐ లు, ఎస్సై లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!