ఈ రోజు రాశి ఫలాలు (29-10-2025)
మేష రాశి:
ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి. ఇతరులతో ఆలోచించి మాట్లాడటం మేలు. పుస్తకాలు ఎక్కువగా చదువుతారు. ఖాళీ సమయంలో ఎక్కువగా ఇంట్లో పనులు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. మీ మీ సామర్థ్యాలేంటో తెలుసుకునేందుకు మంచి రోజు. మీకు రాబోయే వారం రోజుల్లో మంచి సంఘటనలు జరుగుతాయి.
వృషభ రాశి:
ఆర్థిక పరంగా నష్టపోతారు. కాగా డబ్బు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త వహించడం మేలు. మీ ఫ్రెండ్స్ కు హెల్ప్ చేస్తారు. భాగస్వామితో సాయంత్రం వేళ సంతోషంగా గడుపుతారు. గతంలో చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుని బాధపడుతుంటారు. మీ తప్పు మీరు తెలుసుకుంటారు. నేడు ఇంటికి చుట్టాలు వస్తారు.
మిథున రాశి:
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వ్యాపారంలో మంచి లాభాలు చేకూరుతాయి. ప్రశాంతత కోసం పార్కుకు వెళ్లారు. పెద్దల సలహాలు తీసుకుంటారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. మీ భాగస్వామితో సాయంత్రం పూట బయటకెళ్తారు. ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవడం మేలు.
కర్కాటక రాశి:
పని విషయంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మేలు. పిల్లలతో ఎక్కువగా సమయాన్ని గడుపుతుంటారు. నేటి నుంచి ధనాన్ని పొదుపు చేస్తే మంచిది. కానీ కొన్ని విషయాలు మిమ్మల్ని ఆందోళన చెందేలా చేస్తాయి. కుటుంబ సభ్యులతో గడపటం మేలు.
సింహా రాశి:
ఈ రాశి వారు మీ పనుల కోసం ఇతరులను బలవంతం చేయొద్దు. ఆర్థికంగా బాగుంటుంది. మీ అక్కా చెల్లెల్లతో కలిసి సినిమాకు వెళ్తారు. సెమినార్లు ఇస్తారు. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆఫీసులో ప్రశంసలు అందుకుంటారు.
కన్యా రాశి:
బయట కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. నేడు కష్టపడి చేస్తారు. ఫ్యామిలీతో గడపాలని అనుకున్న ప్రణాళికలు విఫలం అవుతాయి. ఇష్టమైన ఆహారం తయారు చేసుకుని తింటారు. మీ భాగస్వామి మీతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు.
తులా రాశి:
అనవసరపు విషయాల గురించి ఆలోచించి సమయాన్ని వృథా చేసుకోకపోవడం మేలు. మీ ప్రేయసితో ప్రేమలో మునిగితేలుతారు. పార్కుకు వెళ్తారు. అమ్మనాన్నలతో గడుపుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
వృశ్చిక రాశి:
భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు. ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. మీరు పని చేసే కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని పొందుతారు. ఫ్రెండ్తో కలిసి సినిమాకు వెళ్తారు. మీ భాగస్వామి మిమ్మల్ని క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు రావడానికి చాలా హెల్ప్ చేస్తారు.
ధనుస్సు రాశి:
నేడు మంచి విజయాలు అందుకుంటారు. కానీ ఆర్థికపరంగా మీ ఆలోచనలు ముందుకు సాగవు. మంచి నవలను కానీ, మ్యాగజైన్ కానీ చదువుతారు. సాయంత్రం వేళ స్నేహితులతో గడపండి. మీ భాగస్వామి నేడు మిమ్మల్ని పొగడటమే పనిగా పెట్టుకుంటాడు. ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటారు.
మకర రాశి:
ప్రయాణం సమయంలో మీ వస్తువుల పట్ల జాగ్రత్త వహించడం అవసరం. వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా నష్టపోతారు. కానీ ఏదో ఒక రూపంలో భగవంతుడు మీకు సహాయం చేస్తాడు. కొన్ని విషయాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంటాయి. మీ భాగస్వామితో కలిసి మెలిసి ఉంటారు
కుంభ రాశి:
మీ జీవితంలో గణనీయమైన మార్పులు జరుగుతాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తు గురించి లోతుగా ఆలోచిస్తారు. ఆరోగ్యం పై శ్రద్ధ వహించడం మంచిది. నేడు మీ దగ్గరి వాళ్లను అన్ని విషయాలు పంచుకునే అవకాశం ఉంది. కానీ జాగ్రత్తగా మెలగండి.
మీన రాశి:
మీ వ్యక్తిగత జీవితంలో సంబంధాలు బలపడుతాయి. కెరీర్ పై ఫోకస్ చేస్తారు. భాగస్వామితో చిటికిమాటికి గొడవ పడటం మంచిది కాదు. ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవడం మేలు. అనాథలకు సహాయం చేస్తే కుటుంబానికి మేలు జరుగుతుంది. డబ్బు పరంగా కలిసి వస్తుంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments