కరీంనగర్ జిల్లాలో అర్థరాత్రి భారీ దోపిడి.
జనం వాయిస్, కరీంనగర్, జూలై 22:
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని భగత్ నగర్ భగత్సింగ్ విగ్రహం సమీపంలో స్థానికంగా నివాసం ఉంటున్న అజ్మత్ అలీ అనే వృద్ధుడి ఇంట్లోకి అర్థరాత్రి 12 గంటల తర్వాత సుమారు ఎనిమిది మంది గుర్తు తెలియని దుండగులు చొరబడ్డారు. దోపిడీకి పాల్పడ్డారు. అజ్మత్ అలీ ఇంటి బయట లైట్ ఆఫ్ చేసి లోపలికి వెళ్లి పడుకోవడానికి సిద్ధమవుతుండగా.. బయటే మాటు వేసి ఒక్కసారిగా ఆయనపై దాడి చేసి ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించారు. అందరినీ బెదిరిస్తూ అజ్మత్ అలీతో పాటు కుటుంబ సభ్యులను కట్టేసి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న నగదు, బంగారాన్ని దోచుకుని పరార్ అయ్యారు. ఈ ఘటనలో రూ.15 లక్షల నగదు, 60 తులాల బంగారాన్ని దుండగులు అపహరించినట్లు ఇంటి యజమాని అజ్మత్ అలీ తెలిపాడు. పోలీసులు సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకుని.. సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments