EPAPER
Thursday, April 2, 2026
Google search engine

కరీంనగర్ డిసిసి అధ్యక్షుడిగా మేడిపల్లి సత్యం..!?

📰 Generate e-Paper Clip

కరీంనగర్ డిసిసి అధ్యక్షుడిగా మేడిపల్లి సత్యం..!?
– మెరుగైన అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం
– గ్రూప్ రాజకీయాలకు సవరణకు దిగ్గజ నేతగా మేడిపల్లి సత్యం గుర్తింపు
– మెజారిటీ కార్యకర్తలు అధిష్టానానికి మేడిపల్లి సత్యం పేరు సూచన.

జనం వాయిస్ దినపత్రిక, కరీంనగర్:

కరీంనగర్ జిల్లాలోనీ గ్రూప్ రాజకీయాలకు,లొల్లికి కాంగ్రెస్ అధిష్టానం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ను కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియామకం చేయటానికి భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఇటీవలే కాంగ్రెస్ పార్టీ  సంస్థాగత పునర్నిర్మాణంపై దృష్టిసారించడంతో పార్టీ శ్రేణుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అధికారంలో లేకపోవడం, ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చినా ఆటు సంస్థాగత పదవులు గానీ, ఇటు నామినేటెడ్ పదవులు దక్కక నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు, క్రియాశీల కార్యకర్తలు, గ్రామీణస్థాయి నాయకుల్లో ఇప్పుడు ఉత్సాహం మొదలైంది.పార్టీ ఆధిష్టానవర్గం సంస్థాగత పునర్నిర్మాణంపై దృష్టిసారించడమే కాకుండా ఉమ్మడి జిల్లాల స్థాయిలో ఇన్చార్జీలను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించడంతో వారు తమకు అప్పగించిన బాధ్యతల్లో పనిచేయడం ప్రారంభించారు.. ఉమ్మడి జిల్లా సంస్థాగత ఇన్చార్జి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని జిల్లాల్లో పర్యటన ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆయన సమావేశం ఏర్పాటు చేసి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక జిల్లా ఉపాధ్యక్షున్ని, ప్రతి బ్లాక్ నుంచి ఒక ప్రధాన కార్యదర్శిని, ప్రతి మండలం నుంచి ఒక కార్యదర్శిని తీసుకుంటామని ప్రకటించారు. క్షేత్రస్థాయి నేతలు ఆయా పదవుల క్రీడ కోసం అప్పుడే తమ ప్రయత్నాలు ప్రారంభించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి కూడా తీవ్రమైన పోటీ నెలకొన్నది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!