జూబ్లీహిల్స్‌లో నిరుద్యోగుల దుమారం.
-కాంగ్రెస్‌పై మండిపడుతున్న అభ్యర్థులు.
జనం వాయిస్,హైదరాబాద్,అక్టోబర్ 31:
రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఆరాటపడుతున్న నిరుద్యోగులు ఇప్పుడు రాజకీయ పోరాటానికి దిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న ఆగ్రహంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో నిరుద్యోగులు బరిలోకి దిగారు.ఈ నియోజకవర్గంలో మొత్తం 13 మంది నిరుద్యోగ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరంతా తమ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.”నిరుద్యోగులకు ఆశలు చూపి నిలువునా మోసం చేశారు,” అని చెబుతూ, ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుద్యోగుల న్యాయం కోసం ఈ ఎన్నికను ఒక ఉద్యమంగా మలుస్తామన్న ఉద్దేశంతో వారు రంగంలోకి దిగారు.ఇక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న యువతి ఆస్మా తన ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రజా మద్దతుతో ఆమె జూబ్లీహిల్స్‌లో దూకుడు పెంచి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,“గంగిరెద్దుకైనా ఓటు వేయండి కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయొద్దు. హస్తం గుర్తుకు ఓటేస్తే, మళ్లీ మీ చేతుల్లోనే ‘హ్యాండ్’ ఇవ్వడం ఖాయం. ఈసారి మాకు అవకాశం ఇవ్వండి, టార్చ్ లైట్‌కు ఓటేస్తే మీ జీవితాల్లో వెలుగు వస్తుంది,” అని ఆస్మా పిలుపునిచ్చింది.ప్రజలలో నిరుద్యోగ సమస్యపై పెరుగుతున్న అసహనం, ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తోంది.ఉపఎన్నికల్లో ఈ యువ అభ్యర్థుల ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాలి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments