చేవెళ్ల రోడ్డు ప్రమాదం పట్ల మంత్రి సీతక్క సంతాపం
జనం వాయిస్,హైదరాబాద్, నవంబర్ 3:
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల రాష్ట్ర రోడ్డు రవాణా, భద్రతా శాఖ మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “చేవెళ్ల మండలంలో జరిగిన ఈ భయంకర ప్రమాదం నా మనసును ఎంతో కలచివేసింది అన్నారు.మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి త్వరితగతిన చికిత్స అందించాలని సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రోడ్డు భద్రతా చర్యలను మరింత బలోపేతం చేస్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments