EPAPER
Monday, February 16, 2026
Google search engine

ఆర్టీసీ బస్సు బైక్ ఢీ..సింగరేణి కార్మికునికి గాయాలు.

📰 Generate e-Paper Clip

ఆర్టీసీ బస్సు బైక్ ఢీ..సింగరేణి కార్మికునికి గాయాలు.

జనం వాయిస్, పెద్దపల్లి:

ఆర్టీసీ బస్ బైక్ ఢీకొని సింగరేణి కార్మికుని కి గాయాలు అయినా సంఘటన బుధవారం మంథని-గోదావరిఖని ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అర్జీ 3 ఏ.ఎల్.పి లో విధులకు హాజరు కావడానికి మంచిర్యాల సున్నంబట్టి వాడ నుంచి వస్తున్న సింగరేణి కార్మికుడు బదిలీ వర్కర్ కోట ప్రదీప్ కి మంథని నుండి గోదావరిఖని కి వస్తున్నా ఆర్టీసీ బస్సు సుందిల్ల దగ్గర ఢీకోంది.ప్రదీప్ కి తీవ్ర గాయాలు కాగా అతన్ని వెంటనే స్థానికులు సింగరేణి ఏరియా హాస్పిటల్ కు చికిత్స కోసం తరలించారు.బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు.బస్ డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని విశ్వసనియ సమాచారం.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!