EPAPER
Monday, February 16, 2026
Google search engine

ఈ రోజు రాశి ఫలాలు (06-11-2025)

📰 Generate e-Paper Clip

ఈ రోజు రాశి ఫలాలు (06-11-2025)

మేష రాశి:

మీకు తెలియకుండానే ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. మంచి ఆలోచనలతో మీరే కాకుండా ఎదుటివారిని కూడా సంతోష పెడతారు. ఏ కార్యక్రమాలైన మీ అంచనాలకు మించి లబ్దిని చేకూరుస్తాయి.

వృషభ రాశి:

శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధాలు వస్తాయి. ఎక్కువగా సాంగ్స్ వింటారు. ఇవాళ మీ నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకుంటారు. ఇంట్లో కార్యక్రమాలు జరుగుతాయి. మీ నిర్ణయాలకు పెద్దలు గౌరవిస్తారు.. ఎక్కువగా ముస్తాబవ్వడానికి ప్రాధాన్యత ఇస్తారు.

మిథున రాశి:

భార్యాభర్తలిద్దరూ ఒకరిపై ఒకరు ఎనలేని ప్రేమను వ్యక్త పరుచుకుంటారు. కానీ అనవసరపు విషయాల గురించి ఆలోచించి సమయాన్ని వృథా చేసుకుంటారు. పలు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కాగా ఈ రాశి వారు అప్పులు చేయకుండా జాగ్రత్త పడటం మేలు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా చిన్న చిన్న పార్టీలకు అటెంట్ అవుతుంటారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

కర్కాటక రాశి:

ఆర్థికంగా నష్టపోతారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి వెనకడుగు వేస్తారు. కాగా పెద్దల సలహాలు తీసుకోవడం మేలు. కొన్ని విషయాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంటాయి. మీ భాగస్వామితో కలిసి మెలిసి ఉంటారు. డబ్బు ఎక్కువగా ఖర్చు పెడతారు.

సింహ రాశి:

మీ ఫ్రెండ్స్‌కు హెల్ప్ చేస్తారు ఆర్థికపరంగా లాభాలు చేకూరుతాయి. జిమ్‌కు వెళ్తారు. భాగస్వామితో సాయంత్రం వేళ సంతోషంగా గడుపుతారు. కానీ వ్యాపారాల విషయాలను గమనించుకుంటూ ఉండండి. మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి మీ భాగస్వామి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు.

కన్యా రాశి:

ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. మీరు పని చేసే కంపెనీలో ముఖ్యమైన స్థానాన్ని పొందుతారు. ఫ్రెండ్‌తో కలిసి సినిమాకు వెళ్తారు. మీ భాగస్వామి మిమ్మల్ని క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు రావడానికి చాలా హెల్ప్ చేస్తారు. రాశి వారి ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి.

తులా రాశి:

డబ్బు పరంగా కలిసి వస్తుంది. భాగస్వామితో హ్యాపీగా గడుపుతారు. బంధువుల మద్దతు లభిస్తుంది. మీపై స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తారు. కానీ ఎవరినీ అంతగా నమ్మవద్దు. ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ పెట్టడం మంచిది. మీ భాగస్వామితో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు.

వృశ్చిక రాశి:

కష్టపడి పని చేస్తారు. ప్రశంసలు అందుకుంటారు. దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది. కాగా జాగ్రత్త వహించండి. ఫ్యామిలీతో గడపాలని అనుకున్న ప్రణాళికలు విఫలం అవుతాయి. జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే నొప్పించే అవకాశం ఉంది.

ధనుస్సు రాశి:

నేడు మీ దగ్గరి వాళ్లతో అన్ని విషయాలు పంచుకునే అవకాశం ఉంది. కానీ జాగ్రత్తగా మెలగండి. మీ బెటర్ హాఫ్‌తో చక్కని సమయం గడుపుతారు. ఏ సమస్యనైనా సులువుగా పరిష్కరిస్తారు. అక్క చెల్లెలు, అన్నదమ్ములతో సినిమాకు రాత్రి సమయంలో ఎక్కువగా మాట్లాడుతుంటారు. హెల్త్ విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంటుంది.

మకర రాశి:

ప్రశాంతత కోసం పార్కుకు వెళ్లారు. కానీ అక్కడ కూడా తెలియని వారితో ఏదో ఒక విషయంలో వాగ్వాదం జరుగుతుంది. నేడు పక్షులకు గింజలు వేస్తే మంచి జరుగుతుంది.

కుంభ రాశి:

పిల్లలతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. ఈ రోజు ఎక్కువగా నడుస్తారు. డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం వల్ల మీ భాగస్వామితో రాత్రిపూట గొడవ పడుతారు.

మీన రాశి:

నేడు మంచి విజయాలు అందుకుంటారు. కానీ ఆర్థికపరంగా మీ ఆలోచనలు ముందుకు సాగవు. మంచి నవలను కానీ, మ్యాగజైన్ కానీ చదువుతారు. సాయంత్రం వేళ స్నేహితులతో గడపండి. మీ భాగస్వామి నేడు మిమ్మల్ని పొగడటమే పనిగా పెట్టుకుంటాడు. ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!