EPAPER
Friday, October 30, 2026
Google search engine
- Advertisment -spot_img

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక ఆదాయం.ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్.

📰 Generate e-Paper Clip

ఆయిల్ పామ్ సాగుతో రైతులకు అధిక ఆదాయం.ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్.

ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి.

800 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు.

డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలపై ప్రభుత్వ సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి.

రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్.

జనం వాయిస్, గోదావరిఖని, అక్టోబర్ 30:

సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సూచించారు. పెద్దపల్లి జిల్లా ఈసాల తక్కలపల్లి గ్రామంలో ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయిల్ పామ్ సాగుపై రైతుల అవగాహన, శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగుతో రైతులకు మెరుగైన ఆదాయ అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రామగుండం నియోజకవర్గంలో ఇప్పటికే 22 మంది రైతులు 35 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టడం అభినందనీయమన్నారు. మరింత మంది రైతులు ఈ పంట సాగుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉద్యానవన శాఖ ద్వారా డ్రిప్, స్ప్రింక్లర్ సాగు పరికరాలపై ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని రైతులు వినియోగించుకోవాలన్నారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని నీటిని పొదుపుగా వినియోగిస్తూ వ్యవసాయం చేయాలని సూచించారు. మరోవైపు రామగుండం ప్రాంతంలో 800 మెగావాట్ల విద్యుత్ నిల్వ లక్ష్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కుక్కలగూడూరు, మద్దిరాల, ధర్మారం ఎక్స్‌రోడ్, కుందన్‌పల్లి ప్రాంతాల్లో రూ.12.64 లక్షల వ్యయంతో సబ్‌స్టేషన్ల ఏర్పాటు చేపడుతున్నట్లు తెలిపారు. రైతులకు ఆధునిక సాగు విధానాలు, ప్రభుత్వ పథకాలు, సాంకేతిక పరిజ్ఞానంపై అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!