ఈ నెల 7న వందేమాతర గేయం సామూహిక గీతాలాపన.
-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
జనం వాయిస్,పెద్దపల్లి,నవంబర్ 6:
వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 7వ తేదీన ఉదయం 9.45 నిమిషాలకు సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు.బంకిం చంద్ర చటర్జీ వందేమాతర గేయ రచన చేసి 150 సంవత్సరాలు పూర్తయిందని,ఈ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని,జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు,అన్ని ప్రభుత్వ,స్థానిక సంస్థల,ఎయిడెడ్,ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలలో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమానికి అధికారులు,ఉద్యోగులు,ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments