EPAPER
Wednesday, June 3, 2026
Google search engine

జన సేవకుడు డా.సురభి శ్రీధర్ కు నంది అవార్డు.

📰 Generate e-Paper Clip

జన సేవకుడు డా.సురభి శ్రీధర్ కు నంది అవార్డు.

జనం వాయిస్, గోదావరిఖని:

వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఆసియా ఇంటర్నేషనల్  కల్చరల్ రిసర్చీ స్ఫూర్తి అకాడమీ,స్ఫూర్తి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్,స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో  ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ ముషీరాబాద్ లోని సిటీ కల్చర్ ఆడిటోరియంలో వివిధ రంగాలలో సేవలందించిన సామాజిక సేవకులకు జాతీయస్థాయి అవార్డులు ప్రధానం చేశారు.దీనిలో భాగంగా వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ సురభి శ్రీధర్ చేస్తున్న సేవలను గుర్తించి ప్రముఖుల    చేతుల మీదుగా సంస్థ నిర్వాహకులు డాక్టర్ ఆకుల రమేష్ నంది అవార్డును సురభి శ్రీధర్ కు అందించారు.అనంతరం సురభి శ్రీధర్ మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో ఎంతో మంది నిస్సహాయులకు దాతల సహకారంతో సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని తెలిపారు.తను  తీసుకుంటున్న ప్రతి అవార్డు తను చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరికి అంకితం చేస్తున్నానని తెలిపారు.సురభి శ్రీధర్ కు నంది అవార్డు రావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలుపుకుంటున్నానని సురభి శ్రీధర్ తెలిపారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!