ఇల్లు కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతి.
జనం వాయిస్,మంథని,నవంబర్ 7:
తన ఇల్లు కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలని షెడ్యూల్ ట్రైబల్ నేషనల్ కమిషనర్ మెంబర్ ఊషణ్ నాయక్ ను మంథని మాజీ కౌన్సిలర్ కుర్ర లింగయ్య శుక్రవారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు.హైకోర్టు ఉత్తర్వులు దిక్కరించి నా ఇంటిని కూల్చి వేశారని,అక్రమ నిర్మాణం అని చెప్పి నా ఇంటి నిర్మాణం కూల్చివేసిన అధికారుల పైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రంలో అయన కోరారు.మంథని పట్టణంలోని ఎరుకల ఏకలవ్య కులస్తుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments