ఐపీఎస్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు.
జనం వాయిస్,సుల్తానాబాద్,నవంబర్ 14:
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు రోజులపాటు సాంస్కృతిక, కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పాటలు, నృత్యాలు,నాటికలు,క్విజ్, డ్రాయింగ్ పోటీలు వంటి విభిన్న కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.పాఠశాల ఆవరణ ఆనందోత్సాహాలతో మార్మోగింది.ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ఆటపాటలతో సరదాగా గడిపారు ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ. “పిల్లలు దేశ భవిష్యత్తు. వారిలోని ప్రతిభను వెలికితీయడం, సృజనాత్మకతను పెంపొందించడం మన అందరి బాధ్యత” అని అన్నారు.ఈ కార్యక్రమం ముగింపులో విజేతలకు బహుమతులు అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు,విద్యార్థిని విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments