EPAPER
Tuesday, February 17, 2026
Google search engine

మానవత్వం చాటుకున్న ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.!

📰 Generate e-Paper Clip

మానవత్వం చాటుకున్న ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు.!



జనం వాయిస్, భూపాలపల్లి, నవంబర్ 15:


తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తికి సకాలంలో వైద్యం అందేలా చొరవ తీసుకొని నిండు ప్రాణాన్ని కాపాడారు. స్థానికుల వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం శివారులో గల పెట్రోల్ పంపు దగ్గర శనివారం సాయంత్రం ప్రధాన రహదారిపై బైక్ ను టిప్పర్ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.అయితే ప్రమాద సమయంలో మంథని నియోజకవర్గం లోని కాటారం మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని అటుగా వెళ్తున్న మంత్రి శ్రీధర్ బాబు తన కాన్వాయ్ ను వెంటనే ఆపారు.క్షతగాత్రులను కలిసి మనోధైర్యం చెప్పారు.అదేవిధంగా వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. దీంతో మంత్రి శ్రీధర్ బాబుకు ఉన్న మానవత్వ స్పూర్తిని స్థానికులు కొనియాడారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!