EPAPER
Sunday, February 15, 2026
Google search engine

ఎన్ హెచ్ ఆర్ సి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్య నాయకుల సమావేశం.

📰 Generate e-Paper Clip

ఎన్ హెచ్ ఆర్ సి. రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్య నాయకుల సమావేశం.

నూతన జిల్లా కార్యవర్గం నియామకపై చర్చ.

ఈనెల 23న సిరిసిల్లలో జిల్లా స్థాయి సమావేశం.

రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య రాక.



జనం వాయిస్,రాజన్న సిరిసిల్ల:

జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ నూతన కార్యవర్గ సమావేశం ఈనెల 23న ఏర్పాటు చేస్తున్నట్లు ఆదివారం జరిగిన  సమావేశంలో జిల్లా ముఖ్య నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏర్పడిన జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన బలమైన వేదికగా నిర్మాణం అయిందని, అందులో భాగంగా సిరిసిల్ల రాజన్న జిల్లా కమిటీ, జిల్లాలోని మండల కమిటీలు ఏర్పాటు చేయనునట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య హాజరవుతారని తెలిపారు.సిరిసిల్ల పట్టణంలోని వైశ్య సత్రంలో జరిగే సమావేశానికి జిల్లాలోని విద్యావంతులు మేధావులు సామాజిక ఉద్యమకారులు పెద్ద ఎత్తున హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పాల్గొన్న వారు తీగల మల్లికార్జున్ ,అక్షర జ్యోతి పత్రిక జిల్లా ప్రతినిధి,జిల్లా కమిటీ సభ్యులు నాగభూషణం, ఎల్లె బాలకృష్ణ, బియ్యంకార్ శ్రీనివాస్, చీకోటీ అనిల్ కుమార్,  కుసుమ గణేష్, చిప్ప దేవదాస్, మడికొండ శ్రీనివాస్, వెంగళ వెంకటేశం, బొల్లు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఈనెల 23 జరిగే సమావేశం విజయవంతం కావడానికి సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకులు మండలాల ఇన్చార్జిలుగా బాధ్యతలు తీసుకున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!