జపాన్‌లో భూకంపం… ప్రభాస్‌కు తప్పిన ప్రమాదం.
జనం వాయిస్, సినిమా:
జపాన్ పర్యటనలో ఉన్న తెలుగు స్టార్ హీరో ప్రభాస్కు తృటిలో ప్రమాదం తప్పింది.‘బాహుబలి’ రీ–రిలీజ్ కార్యక్రమంలో పాల్గొనడానికి జపాన్ చేరుకున్న ప్రభాస్ అక్కడ జపాన్ అభిమానులతో, స్థానిక మీడియాతో సందడి చేస్తున్న సమయంలోనే ఆ దేశంలో భూకంపం సంభవించింది. ఈ సమాచారం బయటకు రావడంతో ప్రభాస్ అభిమానులు ఆందోళన చెందారు.అయితే ఎలాంటి ప్రమాదం జరగలేదని, ప్రభాస్ పూర్తిగా సురక్షితంగా ఉన్నారని ఆయన తాజా చిత్ర దర్శకుడు మారుతి స్వయంగా స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఆయన ఇలా తెలిపారు.“ప్రభాస్‌తో ఇప్పుడే మాట్లాడాను. భూకంపం వచ్చిన ప్రాంతంలో ఆయన లేరు. ఆయన క్షేమంగా ఉన్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదు.”ఈ సందేశం వచ్చాక ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. జపాన్ పర్యటనలో ఆయన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments