EPAPER
Tuesday, June 2, 2026
Google search engine

రాయలసీమ యాసలో అఖిల్ ప్రయోగం.

📰 Generate e-Paper Clip

రాయలసీమ యాసలో అఖిల్ ప్రయోగం.

జనం వాయిస్, సినిమా, మే 24:

అక్కినేని యువ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం నటిస్తున్న లెనిన్ సినిమా ఆయన కెరీర్‌లో అత్యంత కీలక ప్రాజెక్ట్‌గా మారింది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా పూర్తిగా రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ముఖ్యంగా చిత్తూరు ప్రాంత జీవనశైలి, స్థానిక సంస్కృతి, గ్రామీణ వాతావరణాన్ని సహజంగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు చిత్రబృందం సమాచారం. పాత్రల నేటివిటీని మరింత బలంగా చూపించేందుకు దర్శకుడు యాసపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సినిమాలో ప్రధాన పాత్రల సంభాషణలు పూర్తిగా రాయలసీమ యాసలోనే ఉండనున్నాయి. ముఖ్యంగా అఖిల్ పాత్రకు కూడా అదే తరహా డైలాగ్ డెలివరీ ఉండబోతోందని సమాచారం. ఇప్పటివరకు ఎక్కువగా క్లాస్‌, అర్బన్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించిన అఖిల్‌కు ఇది పూర్తిగా కొత్త తరహా ప్రయోగంగా భావిస్తున్నారు. రాయలసీమ యాసలో మాట్లాడటం, స్థానిక భాషా శైలిని అలవాటు చేసుకోవడం కోసం అఖిల్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. టీజర్‌లో అఖిల్ వాయిస్ కొంత భిన్నంగా అనిపించినప్పటికీ.. సినిమాలో మాత్రం ఆయన స్వరానికి సహజమైన రాయలసీమ మాడ్యులేషన్ జోడించేలా ప్రత్యేకంగా పని చేస్తున్నారని సమాచారం. పాత్రలో పూర్తి స్థాయిలో ఒదిగిపోవడానికి ఆయన తీసుకుంటున్న కృషి అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. అఖిల్-భాగ్యశ్రీ జంట మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా సహజంగా వచ్చిందని, ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా రూపొందించారని సమాచారం. గత చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో అఖిల్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ‘లెనిన్’ ద్వారా బలమైన కంబ్యాక్ ఇవ్వాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీజర్‌తోనే ఆసక్తి పెంచిన ఈ చిత్రం విడుదల తర్వాత అఖిల్ కెరీర్‌కు కీలక మలుపు తీసుకురావచ్చని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!