మరికొద్దిసేపట్లో శ్రీ ధర్మశాస్త్ర దర్శనం…!!
– పొన్నంబలమేడు లో నేడు 6:30 నుంచి 6:45నిమిషాలకు మకర జ్యోతి వెలుగు.
– అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగుతున్న శబరిమల.
– మకరజ్యోతిని ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాది అయ్యప్ప భక్తులు.
జనం వాయిస్, వెబ్ డెస్క్:
ప్రపంచంలోనే అతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలలో ప్రతి ఏడాది దర్శనమిచ్చే మకరజ్యోతికి చాలా ప్రత్యేకత ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది సంక్రాంతి వేళ శబరిమల కొండలకు ఎదురుగా ఉన్న పొన్నాంబలమేడుపై మకరజ్యోతిని మకరజ్యోతి దర్శనమివ్వనుంది. ఈ ఏడాది జనవరి 14న మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది. ఈరోజు సాయంత్రం 6:30 నుంచి 6:45 గంటల మధ్య మకరజ్యోతి కనిపించనుంది. అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు పొందడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. మకరజ్యోతిని ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాది అయ్యప్ప భక్తులు శబరిమలలో ఎదురుచూస్తుండగా, కోట్లాది మంది భక్తులు వివిధ మాధ్యమాల ద్వారా పరోక్షంగా వీక్షించనున్నారు.
సాధారణంగా పలు టీవీ న్యూస్ ఛానల్స్, భక్తి ఛానల్స్ మకరజ్యోతి దర్శనాన్ని ప్రత్యక్ష ప్రసారం అందించనున్నాయి. మీరు ఆన్లైన్ ద్వారా మకర జ్యోతి దర్శనం చేసుకోవాలనుకుంటే యూట్యూబ్లో దూరదర్శన్ లైవ్ చూడటం ద్వారా మకర జ్యోతి దర్శనం చేసుకోవచ్చు. అదే విధంగా యూట్యూబ్లోని పలు మలయాళ న్యూస్ చానల్స్ కూడా ఈ పవిత్ర ఘట్టాన్ని లైవ్లో అందిస్తాయి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments