కామారెడ్డి డిక్లరేషన్ తుంగలో తొక్కిన కాంగ్రెస్.
-బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్.
-మంథనిలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టిన బీసీ సంఘం నాయకులు.
జనం వాయిస్, మంథని:
కామారెడ్డి డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ తుంగలో తొక్కి బీసీల గొంతును తడిగుడ్డతో కోసిందని బీసీ సంక్షేమ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ విమర్శించారు. సోమవారం నియోజకవర్గ కేంద్రమైన మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయకుండా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నందుకు నిరసనగా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ మాట్లాడుతూ సర్పంచుల ఎన్నికల్లో బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అదే పంథాను మున్సిపల్ ఎన్నికల్లోనూ పునరా వృతం చేసిందని అన్నారు. 56 శాతం ఉన్న బీసీలకు 31 శాతం రిజర్వేషన్లు కల్పిం చడం దుర్మార్గమన్నారు. 11 శాతం ఉన్న ఓసీలకు 61 శాతం రిజర్వేష న్లు కల్పించడం అగ్రవర్ణాల కుట్ర అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ జోక్యం చేసు కొని రిజర్వేషన్లు సరిదిద్దాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రాన్ని అగ్ని గుండం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పెండ్యాల రామ్ కుమార్, నియోజకవర్గ ఇన్చార్జి తోట రాజ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు గుండోజు ప్రవీణ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏగోలపు శంకర్ గౌడ్, బహుజన సేన రాష్ట్ర కార్యదర్శి తగరం శంకర్ లాల్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ మాచిడి రాజు గౌడ్,కాకర్ల పల్లి సర్పంచ్ కొమురయ్య, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కనవేన శ్రీనివాస్ యాదవ్,
మాజీ కౌన్సిలర్ కాయితి సమ్మయ్య, నాయకులు పుట్ట ముఖేష్,ఓదెలు, పుప్పాల తిరుపతి, పిల్లి సత్యం, బోనాల నరేందర్, పోలు కనక రాజు,మిర్యాల శ్రావణ్,వేముల లక్ష్మయ్య,సమ్మయ్య,మాచిడి సత్యనారాయణ గౌడ్,అనిల్ లతో పాటు పలువురు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments