కేసీఆర్‌కు వెలువెత్తిన జన్మదిన శుభాకాంక్షలు.
– రాజకీయ, సినీ ప్రముఖుల సందేశాలు.
– పేరు పేరునా ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్.
– సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్ష.
జనం వాయిస్, హైదరాబాద్, ఫిబ్రవరి 17:
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పలు రాజకీయ పార్టీల నేతలు, సినీ తారలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా కేసీఆర్ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేశ్, తెలంగాణ రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, సినీ నటుడు చిరంజీవి, విజయసాయి రెడ్డి, వైఎస్ షర్మిల తదితరులు ఉన్నారు. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు ఒకే వేదికపై శుభాకాంక్షలు తెలపడం గమనార్హమైంది. ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడిగా కేసీఆర్ సేవలను పలువురు ప్రశంసించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కేసీఆర్ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో మరింత కాలం ప్రజా సేవ చేయాలని సంకల్పించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments