EPAPER
Tuesday, March 3, 2026
Google search engine

తెలంగాణ ఆర్ టి ఐ కమిషనర్ తో వడ్లకొండ మహేందర్ గౌడ్.

📰 Generate e-Paper Clip

  • తెలంగాణ ఆర్ టి ఐ కమిషనర్ తో వడ్లకొండ మహేందర్ గౌడ్.
  • సమస్యలపై ఆర్టీఐ దరఖాస్తుల పరిస్థితిపై విస్తృతంగా చర్చ.
  • జనం వాయిస్, గోదావరిఖని:
  • నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూమెంట్ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు, ఇది మన హక్కు సమాచార పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ వడ్లకొండ మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో, తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ కమిషనర్లతో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లు పి. వి. శ్రీనివాస్ రావు, భోపాల్ , ప్రవీణ్, అయోధ్య రెడ్డి, సింగరేణి మైనింగ్ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన సమయంలో, సుందిళ్ల లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం సమీపంలో వారిని మహేందర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో కమిషనర్లకు “మన హక్కు” డైరీలు అందజేసి, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పరిశ్రమలు, విద్యాసంస్థలు, కార్పొరేషన్ సమస్యలపై ఆర్టీఐ దరఖాస్తుల పరిస్థితిపై విస్తృతంగా చర్చించారు. ప్రభుత్వ అధికారులు ఆర్టీఐకి సరైన సమాధానాలు ఇవ్వకపోతే వారిపై కఠిన చర్యలు తప్పవని కమీషనర్ స్పష్టం చేశారు. ప్రజల హక్కుల పరిరక్షణలో సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం రాష్ట్ర కార్యదర్శి కండె సాగర్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నాయకులు దుర్గాప్రసాద్, విజయ గాంధీ తదితరులు పాల్గొన్నారు..

Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!