EPAPER
Tuesday, March 3, 2026
Google search engine

శివాజీ ఆదర్శంతో యువత ముందుకు సాగాలి.

📰 Generate e-Paper Clip

  • శివాజీ ఆదర్శంతో యువత ముందుకు సాగాలి.
  • బజరంగ్దళ్ ఆధ్వర్యంలో ముత్తారం లో రక్తదాన శిబిరం.
  • జనం వాయిస్, ముత్తారం:
  • ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని ముత్తారం మండల వైద్యాధికారి డాక్టర్ అమరేందర్ రావు అన్నారు. చత్రపతి శివాజీ 396 జయంతి సందర్భంగా గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణలో భజరంగ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొని చత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలవేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 33 మంది యువకులు స్వచ్చందంగా రక్తదానం చేశారు.పెద్దలు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు శివాజీ మహారాజ్ చేసిన సేవలు ఎనలేనివని తన రాజ్యంలోని ఆడవాళ్ల అందరిని మరియు తన శత్రురాజ్య స్త్రీలను తన తోబుట్టువులుగా భావించి పసుపు, కుంకుమ, చీరలు ఇచ్చేవారని అలాంటి ధీరుడు భరతఖండంలో జన్మించడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. దేశంలో అత్యధిక విగ్రహాలు కలిగిన మహారాజు శివాజీ ఒక్కరేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బజరంగ్దళ్ సభ్యులు కోటగిరి అంజి ప్రసాద్,అనంతుల రజనీకాంత్,ఉప్పుల అనిల్ తేజ,యువత శ్రీకాంత్,దేవేందర్,శ్రీధర్,హరీష్ రావు,అలువోజు రాకేష్,కృష్ణ, ఉమాశంకర్,వినయ్,సాయికిరణ్, శ్యామ్,నాగరాజు,పవన్,వార్డు మెంబర్లు  రామ స్వామి,కుక్కల చందు,మేదర్ శేఖర్  పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!