EPAPER
Saturday, April 18, 2026
Google search engine

టి.ఎస్.జె.యూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా గట్టు మహేష్ గౌడ్ నియామకం.

📰 Generate e-Paper Clip

టి.ఎస్.జె.యూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా గట్టు మహేష్ గౌడ్ నియామకం.

జనం వాయిస్, పెద్దపల్లి:

తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (TSJU) పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా గట్టు మహేష్ గౌడ్ ను నియమించినట్లు టి.ఎస్.జె.యూ (TSJU) రాష్ట్ర అధ్యక్షుడు నారాగోని పురుషోత్తం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ లు సంయుక్తంగా ప్రకటించి మహేష్ గౌడ్ కు నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లా కమిటీతో చర్చించి  నూతన అధ్యక్షున్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా అధ్యక్షుడు మహేష్ గౌడ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేస్తానని, జిల్లాలో ఉన్న మీడియా ప్రతినిధుల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని పేర్కొన్నారు. అలాగే TSJU సంస్థను మరింత బలోపేతం చేస్తూ, జర్నలిస్టుల ఐక్యత కోసం కృషి చేస్తానని తెలిపారు. నా మీద నమ్మకంతో నన్ను అధ్యక్షుడిగా నియమించిన  రాష్ట్ర అధ్యక్షులు నారాగోని పురుషోత్తం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్,  రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ అవునురి సంపత్, కొయ్యల రాజమల్లు లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా టి.ఎస్.జె.యూ (TSJU) అధ్యక్షులుగా మహేష్  నియామకం కావడం పై పలువురు జర్నలిస్టులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!

Subscribe