అందరి సహకారంతో ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా.
-అవినీతి రహిత పాలనతో అందరికీ అండగా ఉంటాం.
-మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్.
జనం వాయిస్, మంథని, మార్చి 16:
మంథని మున్సిపాలిటీని అన్ని రంగాల్లో మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి తాము అంకిత భావంతో కృషి చేస్తామని మంథని మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్ అన్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని 11వ వార్డు పరిధిలో గాంధీ చౌక్ లో మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, కౌన్సిలర్ ఎల్లంకి వంశీ లకు గాంధీ చౌక్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఏలాంటి అవినీతి లేకుండా పరిపాలన సాగించనున్నామని ఆయన అన్నారు. ఇంటి పర్మిషన్ల కు, ఇంటి నిర్మాణాలకు ఇతరత్రా పనులకు మున్సిపల్ లో గాని కౌన్సిలర్లకు గాని ఇలాంటి డబ్బులు ఇవ్వవద్దని అవినీతి రహితంగా తమ పరిపాలన ఉంటుందని ఆయన అన్నారు. గాంధీ చౌక్ ప్రాంతం నుండీ తన రాజకీయ జీవితం ప్రారంభమైందని ఈ ప్రాంత ప్రజలు తమ కుటుంబ సభ్యునిగా నన్ను ఆదరించారని అన్నారు. గాంధీ చౌక్ గణేష్ ఉత్సవ సమితి భవనానికి బోరు బావి మంజూరు చేయడంతో పాటు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనుల కైనా తాను ముందుండి పని చేస్తానని అన్నారు. రాబోయే వినాయక చవితి ఉత్సవాలను గాంధీచౌక్ లో ఘనంగా నిర్వహించుకుందామని దీనికి అందరు సహాయ సహకారాలు అందించాలని ఆయన అన్నారు. అదేవిధంగా రాబోయే సంవత్సరంలో గోదావరి పుష్కరాలు జరుగ నున్నాయని ఈ పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుండి లక్షలాదిమంది మంది భక్తులు గోదావరికి వస్తారని గాంధీచౌక్ నుండి వాలంటీర్ గా పని చేయడానికి అందరు ముందుకు రావాలని ఆయన కోరారు. రాబోయే రోజుల్లో పట్టణంలోని కూరగాయల మార్కెట్ సుందరంగా తీర్చి దిద్దుతామని అదే విధంగా ప్రధాన వ్యాపార కూడలీ ఐన గాంధీ చౌక్ లో ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఈ ప్రాంతాన్ని అందంగా తీర్చి దిద్దుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి గాంధీ చౌక్ ఉత్సవ సమితి సభ్యులు కొమురోజు మారుతి అధ్యక్షత వహించగా ఉత్సవ సమితి అధ్యక్షుడు కోమురోజు చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి పెండ్యాల రామ్ కుమార్, మహిళా సభ్యురాలు రేపాల ఉమాదేవి, సీనియర్ సభ్యుడు సిరిపురం వెంకటేశం తో పాటు సభ్యులు కొమురోజు శ్రీనివాస్, ఓల్లాల అశోక్, సిరిపురం రమేష్, గుడిమల్ల కుమార్, కోమురోజు మధుకర్,కొమురోజు వేణు, సిరిపురం కుమార్, దశరథం, రావికంటి మనోహర్, గట్ల శ్రీకాంత్ తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments