EPAPER
Friday, May 8, 2026
Google search engine

పెద్దపల్లి లో రేపు మెగా జాబ్ డ్రైవ్ నిర్వహణ.

📰 Generate e-Paper Clip

  • పెద్దపల్లి లో రేపు మెగా జాబ్ డ్రైవ్ నిర్వహణ.
  • – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
  • – సుమారు 68 సంస్థలలో 3439 ఉద్యోగ అవకాశాలు లభ్యం.
  • జనం వాయిస్, పెద్దపల్లి, మే-05:
  • పెద్దపల్లి జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు మరింత విస్తరించేందుకు జిల్లా పరిపాలన యంత్రాంగం, TASK మరియు DEET సంయుక్తంగా మే 6న పెద్దపల్లి పట్టణంలోని A/C కన్వెన్షన్ హాల్, RTO OFFICE ఎదురుగా, పెద్దపల్లిలో మెగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ డ్రైవ్‌లో సుమారు 20 లోకల్ సంస్థలు మరియు 48 నాన్ లోకల్ సంస్థలు మొత్తం 68 సంస్థలు పాల్గొంటుండగా, సుమారు 3439 ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. జీతం 18,000/- నుండి మొదలై 80,000/- వరకు ఉంటుందని తెలిపారు. టెలికాం & కమ్యూనికేషన్, కస్టమర్ సపోర్ట్ & BPO, సేల్స్ & మార్కెటింగ్, డిజిటల్ సర్వీసెస్, ఫీల్డ్ అసోసియేట్ వంటి వివిధ రంగాల్లో ఈ అవకాశాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. జిల్లాలోని యువతను పెద్ద సంఖ్యలో అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. వారికి తగిన ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. TASK మరియు DEET ద్వారా ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల ద్వారా యువత ఈ తరహా జాబ్ డ్రైవ్ ద్వారా ఉద్యోగాలు సాధించి మంచి స్థాయికి చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసీ, ఇంజినీరింగ్, MBA తదితర అర్హత కలిగిన అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు. యువత ఈ మెగా జాబ్ డ్రైవ్‌ను ఒక మంచి అవకాశంగా తీసుకొని పెద్ద సంఖ్యలో హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు తమ రెజ్యూమ్‌లతో పాటు ఆధార్, DEET పోర్టల్‌లో నమోదు చేసుకుని హాజరు కావాలని తెలిపారు. జిల్లా యువత ఉపాధి పొందడం ద్వారా వారి కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడటమే కాకుండా, జిల్లా సమగ్ర అభివృద్ధికి కూడా దోహదపడుతుందని తెలిపారు. ఈ మేరకు జిల్లా పరిధిలో యువతందరూ భారీగా పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!