EPAPER
Tuesday, October 13, 2026
Google search engine
- Advertisment -spot_img

గెస్ట్ ప్రత్యేక అవసరాల విద్యాబోధకుల నియామకానికి దరఖాస్తులు.

📰 Generate e-Paper Clip

గెస్ట్ ప్రత్యేక అవసరాల విద్యాబోధకుల నియామకానికి దరఖాస్తులు.

  • 11 పాఠశాలల్లో ఖాళీలు.. నెలకు రూ.16,500 గౌరవ వేతనం.
  • ఈ నెల 10లోపు దరఖాస్తులు సమర్పించాలి: డీఈఓ జి. శారద.

జనం వాయిస్, పెద్దపల్లి, అక్టోబర్ 7:

పెద్దపల్లి జిల్లాలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలోని 11 పీఎం శ్రీ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాల పిల్లలకు విద్యాబోధన చేసేందుకు తాత్కాలిక పద్ధతిలో గెస్ట్ ప్రత్యేక అవసరాల విద్యాబోధకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జి. శారద తెలిపారు. ఐదు నెలల కాలానికి చేపట్టే ఈ నియామకంలో ఎంపికైన వారికి నెలకు రూ.16,500 గౌరవ వేతనం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. పీఎం శ్రీ రామగుండం, జడ్పీహెచ్‌ఎస్ కమాన్‌పూర్, అప్పన్నపేట, పోత్కపల్లి, ఏక్లాస్‌పూర్, టీజీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ మేడారం, మల్లాపూర్, టీజీఎంఎస్ రామగుండం, జూలపల్లి, మల్యాల (శ్రీరాంపూర్), టీజీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ మంథని పాఠశాలల్లో ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 10లోపు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లేదా ప్రిన్సిపాళ్లకు దరఖాస్తుతో పాటు ధ్రువపత్రాలను సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం సంబంధిత విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లను సంప్రదించాలని డీఈఓ జి. శారద కోరారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!