తిరుమలగిరిలో క్షుద్ర పూజలు కలకలం.
బొమ్మలు,నిమ్మకాయలు చూసి గ్రామస్తుల ఆందోళన.
పాలకుర్తి, జూన్ 6 జనం వాయిస్:
జనగామ జిల్లా పాలకుర్తి మండలం తిరుమలగిరి గ్రామంలో శనివారం చేతబడి కలకలం రేపింది.గ్రామంలోని ఓ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించినట్లు ఆధారాలు లభ్యమవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. స్థానికుల కథనం ప్రకారం… శనివారం ఉదయం గ్రామ శివారులోని చేతబడికి ఉపయోగించే బొమ్మలు, నిమ్మకాయలు,పసుపు, కుంకుమ చల్లిన పూజా సామాగ్రి పడి ఉండటాన్ని గ్రామస్తులు గమనించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆధునిక కాలంలోనూ కొందరు ఇలాంటి మూఢనమ్మకాలతో గ్రామాల్లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments