EPAPER
Saturday, June 6, 2026
Google search engine

డిప్యూటీ ఈవో పోస్టులకు టీజీపీఎస్సి నోటిఫికేషన్!

📰 Generate e-Paper Clip

డిప్యూటీ ఈవో పోస్టులకు టీజీపీఎస్సి నోటిఫికేషన్!

జనం వాయిస్, హైదరాబాద్:జూన్ 06:

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుభవార్త అందించిం ది, స్కూల్ ఎడ్యుకేషన్ లో కొన్ని ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న డిప్యూ టీ ఎడ్యుకేషన్ ఆఫీ సర్స్  గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది, 

ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24 గెజిటెడ్ స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీజీపీ ఎస్సీ ప్రకటించింది. చాలాకాలంగా ఖాళీగా ఉన్న ఈ ఉన్నత స్థాయి పోస్టులను భర్తీ చేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థల పని తీరును మెరుగుపర చాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నియామకాలు విద్యా వ్యవస్థలో క్షేత్ర స్థాయి పర్యవేక్షణను పటిష్ఠం చేయడానికి ఎంతగానో దోహదప డతాయని విద్యా రంగ నిపుణులు చెబుతు న్నారు.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల అర్హతలకు సంబంధించి కమిషన్ స్పష్టమైన మార్గదర్శకా లను జారీ చేసింది.

2026 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు తప్పనిసరిగా 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయస్సు 44 ఏళ్లుగా నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితిలో సడ లింపులు వర్తిస్తాయి. దీనివల్ల సీనియర్ అభ్యర్థులకు సైతం దరఖాస్తు చేసుకునేం దుకు మంచి అవకాశం లభించనుంది.

దరఖాస్తులు సమర్పించవలసిన తేదీలు!

అర్హులైన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పిం చాల్సి ఉంటుంది.

దరఖాస్తుల ప్రారంభ తేదీ: జూన్ 12, 2026

దరఖాస్తులకు చివరి తేదీ: జులై 19, 2026

సూచన: చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు తలెత్త కుండా ఉండేందుకు అభ్యర్థులు ముందే దరఖాస్తు చేసుకోవడం మంచిదని కమిషన్ సూచించింది.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!