మంథని గురుకులంలో డెటాల్ తాగిన ఇద్దరు విద్యార్థులు.
– ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స.
– ఆసుపత్రి బెడ్ల మీద విద్యార్థులు..? జూమ్ మీటింగ్ లో ఉపాధ్యాయులు.
– ప్రజాసంఘాల పరామర్శ.
జనం వాయిస్, మంథని, జూలై 25:
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని గురుకుల పాఠశాల హాస్టల్ లో అనుమానాస్పద స్థితిలో డెటాల్ తాగిన ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే వివిధ ప్రజాసంఘాల నాయకులు ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించారు. ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్ నాయకులు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ, సెలైన్ పెట్టి చికిత్స చేస్తున్న విద్యార్థులకు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం జరిగింది. మంథని సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్ లో ఏ కారణాల వల్ల విద్యార్థులు డెటాల్ తాగారో తెలియాల్సి ఉండగా విద్యార్థులు మంథని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతు ఉండగా సంబంధిత హౌస్ మాస్టర్ మరియు హెల్త్ సూపర్వైజర్ యాజమాన్యం మరియు సంబంధిత హాస్టల్ ప్రిన్సిపాల్ ఇతర టీచర్లు ఉన్నత స్థాయి అధికారులతో జూమ్ మీటింగ్ లో ఉన్నామని చెప్పడం పట్ల ప్రజా సంఘాల నాయకులు అగ్రహం వ్యక్తం చేసారు. గతంలో మంథని గురుకుల హాస్టల్ లో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని ఇంకా ఇలాంటి ఘటనలే తిరిగి పునరావృతం కాకుండా ఉండాలని అన్నారు. పరామర్శించిన ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ, గురుకులాల్లో విద్యార్థుల భద్రత, ఆహారం, వసతులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద గణేష్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు మంథని లింగయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బందెల రాజకుమార్ పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments