భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ఎస్సై సాంబమూర్తి.
జనం వాయిస్, మహదేవపుర్, జూలై 30:
మహాదేవపూర్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని మహదేవపూర్ ఎస్సై ఎం. సాంబమూర్తి సూచించారు. ఎస్సై సాంబమూర్తి మాట్లాడుతూ .మట్టి గోడల ఇళ్లలో నివసించే వారు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్ఫార్మర్లను తాకరాదని హెచ్చరించారు.రైతులు తడి చేతులతో మోటార్లను ఆన్ లేదా ఆఫ్ చేయవద్దని, విద్యుత్ లీకేజీ అనుమానం ఉన్నప్పుడు వాటిని వినియోగించరాదని తెలిపారు. అలాగే వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలను దాటేందుకు ప్రయత్నించవద్దని, ప్రమాదకర ప్రాంతాల్లో ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్100 .కు లేదా మహాదేవపూర్ ఎస్సై మొబైల్ నంబర్ 8712658116కు సమాచారం అందించి పోలీసుల సహాయం పొందాలని ఎస్సై ఎం. సాంబమూర్తి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments