EPAPER
Tuesday, October 13, 2026
Google search engine
- Advertisment -spot_img

గణపతి నిమజ్జనోత్సవానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు.

📰 Generate e-Paper Clip

గణపతి నిమజ్జనోత్సవానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు.

  • అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా.
  • గోదావరి బ్రిడ్జి నిమజ్జన పాయింట్‌ను పరిశీలించిన సీపీ, కలెక్టర్.

జనం వాయిస్, గోదావరిఖని, సెప్టెంబర్ 23:

గణపతి నిమజ్జనోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. నిమజ్జనోత్సవం సందర్భంగా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం గోదావరిఖని గోదావరి బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన గణపతి నిమజ్జన పాయింట్‌ను సీపీ అంబర్ కిషోర్ ఝా, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లు, గణేష్ శోభాయాత్ర మార్గం, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు ముందుగానే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖతో పాటు గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, మున్సిపల్, సింగరేణి తదితర ప్రభుత్వ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ నిమజ్జనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా డీజేలు వినియోగించడాన్ని పూర్తిగా నిషేధించినట్లు సీపీ స్పష్టం చేశారు. పోలీసుల సూచనలు, నిబంధనలను గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు, భక్తులు తప్పనిసరిగా పాటించాలని కోరారు. గణపతి శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలను మత సామరస్యానికి ప్రతీకగా, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని సీపీ అంబర్ కిషోర్ ఝా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, సింగరేణి, మున్సిపల్ శాఖల అధికారులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!