ఎస్ఐఆర్ను రద్దు చేయాలి.
- జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలి.
- ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.
- గోదావరిఖనిలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.
- జనం వాయిస్, గోదావరిఖని, అక్టోబర్ 7:
- పౌరుల రాజ్యాంగబద్ధ ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కును ఎలాంటి అనుమతి లేకుండా తొలగించే అధికారం ఎవరికీ లేదని, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గోదావరిఖనిలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తా నుంచి మున్సిపల్ టీ జంక్షన్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా “మోదీ హటావో.. దేశ్ బచావో, బీజేపీ హటావో.. దేశ్ బచావో, జ్ఞానేష్ కుమార్ హటావో.. దేశ్ బచావో” అంటూ నినాదాలు చేశారు. ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ వ్యతిరేకులు, మైనార్టీలు, దళితులను ఓటు హక్కుకు దూరం చేసే కుట్ర జరుగుతోందని నాయకులు ఆరోపించారు. ఓటు హక్కును పరిరక్షించడంతో పాటు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రధాన కార్యదర్శి జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని, పౌరుల ఓటు హక్కుకు రక్షణ కల్పించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు ఈ. నరేష్, తోకల రమేష్, ఐ. రాజేశం, ఎం. దుర్గయ్య, ఎం. కొమరయ్య, కే. ధర్మేందర్, పులిపాక మల్లేష్, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments