లక్ష్మీనగర్‌లో మన్ కీ బాత్ 138వ ఎపిసోడ్ వీక్షణ
జనం వాయిస్, గోదావరిఖని, సెప్టెంబర్ 27:
రామగుండం నియోజకవర్గంలోని లక్ష్మీనగర్ మండలం 87వ బూత్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన ‘మన్ కీ బాత్’ 138వ ఎపిసోడ్‌ను బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి వీక్షించారు. బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణితో పాటు పార్టీ శ్రేణులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించిన వివిధ అంశాలను నాయకులు, కార్యకర్తలు ఆసక్తిగా వీక్షించారు. ప్రజలకు సంబంధించిన అంశాలు, దేశ అభివృద్ధి, సమాజంలో ప్రజల భాగస్వామ్యంపై ప్రధాని చేసిన ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నారు. ఈ కార్యక్రమంలో మన్ కీ బాత్ కన్వీనర్ మాచా విశ్వాస్, లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఊరకొండ అపర్ణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుల్వ లక్ష్మీనర్సయ్య, తాడగొండ నర్సయ్య, ఎల్తూరి సరిత రాజయ్య, శ్రీనివాస్ యాదవ్, బొంగ మహేష్, జక్కుల ప్రవీణ్, బియ్యాల మహేందర్, అరుకొండ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments