EPAPER
Tuesday, October 13, 2026
Google search engine
- Advertisment -spot_img

గాల్లోనే ఢీకొట్టిన పక్షి.. ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం!

📰 Generate e-Paper Clip

గాల్లోనే ఢీకొట్టిన పక్షి.. ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం!

  • పుణె నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బర్డ్ హిట్.
  • పైలట్ చాకచక్యంతో శంషాబాద్‌లో సురక్షిత ల్యాండింగ్.
  • విమానం ముందు భాగంలో సొట్ట పడినట్లు గుర్తింపు.

జనం వాయిస్, వెబ్ డెస్క్, అక్టోబర్ 4:

పుణె నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా ఒక పక్షి బలంగా ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ అత్యంత చాకచక్యంగా విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇండిగోకు చెందిన ‘6ఈ352’ విమానం పుణె నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. మార్గమధ్యంలో విమానాన్ని పక్షి ఢీకొట్టింది. దీంతో పైలట్ వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకుని, ఎలాంటి ఇబ్బంది లేకుండా శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని దించారు. ల్యాండింగ్ అనంతరం నిపుణులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో విమానం ముందు భాగంలో సొట్ట పడినట్లు గుర్తించారు. పక్షి ఢీకొనడం వల్లే ఇలా జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. మరోవైపు, విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా చండీగఢ్ వెళ్లాల్సిన సర్వీసును రద్దు చేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!