EPAPER
Tuesday, October 13, 2026
Google search engine
- Advertisment -spot_img

వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.

📰 Generate e-Paper Clip

వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.

  • అడవిశ్రీరాంపూర్‌లో అటవీ, పోలీసు శాఖల సంయుక్త తనిఖీలు.
  • వేట వలలు, ఉచ్చులు, ఇనుప బోను స్వాధీనం.

జనం వాయిస్, మంథని, అక్టోబర్ 7:

వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి సమిష్టి బాధ్యత అని మంథని అటవీశాఖ అధికారి ఎం.వి. నాయక్ అన్నారు. జిల్లా అటవీ అధికారి ఆదేశాల మేరకు బుధవారం ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ గ్రామంలో మంథని, పెద్దపల్లి అటవీ శాఖ సిబ్బంది, ముత్తారం పోలీసుల సహకారంతో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 2 వేట వలలు, 20 ఉచ్చులు, ఒక ఇనుప బోను, 2 కిలోల బైండింగ్ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వన్యప్రాణుల వారోత్సవాల్లో భాగంగా గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.వి. నాయక్ మాట్లాడుతూ చెట్లను అక్రమంగా నరికివేయడం, వన్యప్రాణులను వేటాడటం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. అటవీ వనరులు, వన్యప్రాణుల సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. అక్రమ వేటకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం దర్యాపూర్ తెలంగాణ రాష్ట్ర మోడల్ పాఠశాల, జూనియర్ కళాశాలలో విద్యార్థులు, సిబ్బందికి వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం అడవిశ్రీరాంపూర్ బీట్ పరిధిలోని 444వ విభాగం రిజర్వు అటవీ ప్రాంతంలో పర్యటించారు. మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి, వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మంథని ఎఫ్‌ఆర్‌ఓ ఎం.వినయ్ నాయక్, పెద్దపల్లి ఎఫ్‌ఆర్‌ఓ టి.సతీష్ కుమార్, డిప్యూటీ రేంజ్ అధికారులు పి.దేవదాస్, ఎన్.రమేష్, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు ఎం.నరసయ్య, హెచ్.మంగీలాల్, ఎస్.డి.రహిమతుల్లా, ఎం.డి.అమీర్‌ఉద్దీన్, ముదస్సర్ షా ఖాన్, నహీదా పర్వీన్, ఫారెస్ట్ బీట్ అధికారులు కె.పవన్ కుమార్, ఎం.శ్రీకాంత్, ఎస్.మేఘ రాజు, కె.తిరుపతి, పి.రంజిత, ఎస్.శ్రావంతి, ఎ.మాధురి, ఎస్.ప్రదీప్, క్షేత్ర జీవశాస్త్రవేత్త ఎం.చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!