EPAPER
Saturday, October 17, 2026
Google search engine
- Advertisment -spot_img

దసరా కానుకగా సిబ్బందికి నూతన వస్త్రాల పంపిణీ.

📰 Generate e-Paper Clip

దసరా కానుకగా సిబ్బందికి నూతన వస్త్రాల పంపిణీ.

  • పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయం.
  • 1వ డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్.

జనం వాయిస్, రామగుండం, అక్టోబర్ 17:

విజయదశమి పండుగను పురస్కరించుకుని రామగుండం నగరపాలక సంస్థ 1వ డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులు, మిషన్ భగీరథ, ఎన్పీడీసీఎల్, మున్సిపల్ ఎలక్ట్రికల్ సిబ్బందికి శనివారం డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ మల్లేష్ దసరా కానుకగా నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ నగర పరిశుభ్రత, విద్యుత్, తాగునీటి సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్న సిబ్బంది సేవలు అభినందనీయమన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దసరా పండుగను అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో నిత్యం శ్రమించే సిబ్బందికి ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా నూతన వస్త్రాలు అందించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. పండుగ వేళ కార్మికుల ముఖాల్లో ఆనందం చూడటమే తన లక్ష్యమన్నారు. సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ డివిజన్ అభివృద్ధికి మరింత కృషి చేయాలని కోరారు. డివిజన్ ప్రజలతో పాటు వివిధ శాఖల ఉద్యోగులకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. తమ సేవలను గుర్తించి ఏటా నూతన వస్త్రాలు అందజేస్తున్న కార్పొరేటర్ విజయ మల్లేష్‌కు సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సోషల్ మీడియా ఇన్‌చార్జి గుర్రాల మల్లేష్ యాదవ్, వివిధ శాఖల సిబ్బంది, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!