EPAPER
Tuesday, October 27, 2026
Google search engine
- Advertisment -spot_img

రోడ్డు ప్రమాదంలో బిఆర్ఎస్ సీనియర్ నేత పి.టి. స్వామి మృతి.

📰 Generate e-Paper Clip

రోడ్డు ప్రమాదంలో బిఆర్ఎస్ సీనియర్ నేత పి.టి. స్వామి మృతి.

  • ఈశ్వర కృప వృద్ధాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుడిగా విశేష సేవలు.
  • ప్రమాదం జరిగిన వెంటనే గుండెపోటు రావడంతో విషాదం.

జనం వాయిస్, గోదావరిఖని, అక్టోబర్ 24:

గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా ఎందరో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన సీనియర్ నేత, బీఆర్ఎస్ నాయకుడు, ఈశ్వర కృప వృద్ధాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుడు పి.టి. స్వామి కన్నుమూశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి తిరిగి వస్తుండగా బసంత్‌నగర్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆయనకు గుండెపోటు వచ్చినట్లు సమాచారం. తీవ్ర అస్వస్థతకు గురైన స్వామిని హుటాహుటిన గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఆయన ఆకస్మిక మరణంతో గోదావరిఖని ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉపాధ్యాయుడిగా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంతో పాటు పేద విద్యార్థుల అభ్యున్నతికి ఆయన విశేష కృషి చేశారు. ఈశ్వర కృప వృద్ధాశ్రమాన్ని స్థాపించి వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నిరాశ్రయులు, వృద్ధుల సంక్షేమం కోసం పాటుపడుతూ సేవాభావానికి నిదర్శనంగా నిలిచారు. విద్యారంగంలో సేవలందిస్తూనే సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రజలకు అండగా నిలిచారు. గురువుగా, సేవామూర్తిగా, వృద్ధాశ్రమ వ్యవస్థాపకుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు పేర్కొంటున్నారు. ఆయన మరణం విద్యారంగానికి, సామాజిక సేవా రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వామి మృతి పట్ల పూర్వ విద్యార్థులు, సన్నిహితులు, అభిమానులు, రాజకీయ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!