పీఎన్బీ మెట్లైఫ్లో 700 ఉద్యోగాలు.
ఈ నెల 13న పెద్దపల్లిలో జాబ్మేళా.. జిల్లా ఉపాధి అధికారి రాజశేఖర్.
జనం వాయిస్, పెద్దపల్లి, నవంబర్ 10:
జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పీఎన్బీ మెట్లైఫ్ సంస్థలో ఖాళీగా ఉన్న 700 పోస్టుల భర్తీకి ఈ నెల 13న జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం. రాజశేఖర్ తెలిపారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సంయుక్త సమన్వయంతో పెద్దపల్లిలోని టాస్క్ ప్రాంతీయ కేంద్రంలో ఈ జాబ్మేళా నిర్వహించనున్నట్లు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. పీఎన్బీ మెట్లైఫ్ సంస్థలో లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజర్ పోస్టులు 150, చీఫ్ ఇన్సూరెన్స్ మేనేజర్ పోస్టులు 100, డిస్ట్రిబ్యూషన్ మేనేజర్ పోస్టులు 150, లైఫ్ పోర్ట్ఫోలియో మేనేజర్ పోస్టులు 300 ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్హతలు కలిగిన 25 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులని వివరించారు. ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి రూ.1.50 లక్షల నుంచి రూ.3.60 లక్షల వరకు వేతనంతో పాటు ఇన్సెంటివ్లు అందజేయనున్నట్లు తెలిపారు. పెద్దపల్లి, రామగుండం, గోదావరిఖని, మంథని, మంచిర్యాల, కరీంనగర్ ప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 13వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర)లో ఉన్న టాస్క్ ప్రాంతీయ కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అప్డేటెడ్ బయోడేటా లేదా రెజ్యూమ్, విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు జిరాక్స్, అనుభవం ఉన్నవారు ఎక్స్పీరియన్స్ లెటర్ తీసుకురావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 8985336947, 8121262441, 9182117078 నంబర్లలో సంప్రదించాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎం. రాజశేఖర్ సూచించారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments