తెలంగాణలో 21 మంది ఐపీఎస్‌ల బదిలీలు!
జనం వాయిస్, హైదరాబాద్, నవంబర్ 12:
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 21 మంది ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించింది. కీలకమైన పోలీసు విభాగాల్లో కొత్త అధికారులను నియమించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా మహేష్ భగవత్‌ను నియమించగా, జైళ్ల శాఖ డీజీగా స్వాతి లక్రాకు బాధ్యతలు అప్పగించింది. మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా విభాగాల డీజీపీగా సౌమ్య మిశ్రా, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా చారు సిన్హాను నియమించింది.
టీజీఎస్ఆర్టీసీ ఎండీగా అనిల్ కుమార్, తెలంగాణ ఫైర్ సర్వీసెస్ డీజీగా వీసీ సజ్జనార్, సివిల్ సప్లైస్ కమిషనర్‌గా నాగిరెడ్డిని బదిలీ చేసింది. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ డీజీగా విక్రమ్ సింగ్ మాన్, అదనపు డీజీపీ (లా అండ్ ఆర్డర్)గా ఆకున్ సబర్వాల్, తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్ డైరెక్టర్‌గా ఎం. స్టీఫెన్ రవీంద్రను నియమించింది. ఒకేసారి 21 మంది ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించడంతో రాష్ట్ర పోలీసు శాఖలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments