వెంచర్ అనుమతులకు లంచం.
- ఏసీబీ వలలో నర్సింహులపేట మండల ఎంపీడీఓ, ఎంపీఓ.
మహబూబాబాద్ జిల్లా బ్యూరో / జనం వాయిస్ :
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి ఇద్దరు అధికారులతో పాటు ఒక మధ్యవర్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలోని బృందం నిర్వహించిన ఈ దాడుల్లో, మండల పరిధిలోని ఓ నూతన వెంచర్‌కు సంబంధించిన అనుమతులు మంజూరు చేయడానికి రూ.45 వేల లంచం తీసుకుంటుండగా ఎంపీడీవో రాధిక, ఎంపీవో కిన్నెర యాకయ్యలను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన ఎంపీడీవో కుమారుడు రాంప్రసాద్‌ను కూడా అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదు మేరకు ముందస్తు ప్రణాళికతో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సంబంధిత పత్రాలు, రికార్డులను పరిశీలిస్తూ కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. అధికారులు నిందితులపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments