బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్.
జనం వాయిస్, మంచిర్యాల, జూన్ 01:
కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా బీఆర్‌ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల కార్పొరేషన్ బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు జిల్లా కేంద్రంలోని ఓవర్ బ్రిడ్జి వద్ద భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాయి. మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గార్ల ఆదేశానుసారం చేపట్టిన ఈ నిరసనలో.. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడమే ధ్యేయంగా ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని మండిపడుతూ, బాల్క సుమన్ గారిని బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, టీబీజీకేఎస్ నాయకులు, బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని నిరసనను విజయవంతం చేశారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.





Recent Comments