మీ సెల్ ఫోన్లకు ఈరోజు సైరన్ శబ్దం రావచ్చు?
భయపడవలసిన అవసరం లేదంటున్న అధికారులు!
జనం వాయిస్, హైదరాబాద్, మే 02:
ఈరోజు మీ మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మోగడం లేక స్క్రీన్‌పై ఒక వింత మెసేజ్ కనిపించడం జరిగిందా? అలా జరిగి తే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎమ ర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ పరీక్షలో భాగం మాత్రమే. ఈ అలర్ట్ అలారం మెసేజ్‌లు ఈరోజు ఉదయం 11 గంటల నుంచి ఎప్పుడైనా రావచ్చు.
అయితే ఈ సైరన్ అలర్ట్ ఇది వరకు కూడా చాలా మందికి వచ్చాయి. అలాంటి వారు కూడా భయప డాల్సిన అవసరం లేదు.నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సంయుక్తంగా ఈ పరీక్ష లనునిర్వహిస్తున్నాయి,ఇందుకోసం సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్, అభి వృద్ధి చేసిన SA CHET అనే ప్లాట్‌ఫార మ్‌ను వాడుతున్నారు.
మనం సాధారణంగా పంపే మెసేజ్‌లలా కాకుండా, ఇది సెల్ బ్రాడ్కాస్ట్, సాంకేతి కతపై పనిచేస్తుంది. నెట్‌వర్క్ రద్దీగా ఉన్నా సరే, సెకన్ల వ్యవధిలో నిర్ణీత ప్రాంతంలోని మొబైల్ వినియోగదా రులందరికీ ఇది చేరు తుంది. తుఫానులు, భూకంపాలు, సునా మీలు లేదా గ్యాస్ లీకే జీల వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను తక్షణమే అప్రమత్తం చేయడానికి ఇది అత్యంత ప్రభావవంత మైన సిగ్నల్ అని చెప్తు న్నారు అధికారులు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments