EPAPER
Wednesday, April 22, 2026
Google search engine

కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ..!

📰 Generate e-Paper Clip

కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ..!

జనం వాయిస్, కాళేశ్వరం, భూపాలపల్లి, ఏప్రిల్20:


జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం సీఎం రేవంత్ రెడ్డి, కాళేశ్వరం చేరుకొని అక్కడ ఉన్న కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శిం చుకున్నారు. అనంతరం రూ 198 కోట్లతో చేపట్ట బోయే ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి,భూమి పూజ చేశారు. అనంతరం మేడిగడ్డకు చేరుకుని ఈ ఎన్ డి ఎస్ ఏ చైర్మన్ అనిల్ జైన్ తో కలిసి బ్యారేజ్ ని పరిశీలిం చారు. అక్కడ ఇరిగేషన్ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , పొన్నం ప్ర‌భాక‌ర్ , ఎన్ డీఎస్ ఏ ఛైర్మ‌న్ అనిల్ జైన్ వున్నారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం అందజేశారు. అనంతరం సీఎం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శ్రీ శుభానంద (పార్వతి) అమ్మవారి ఆలయంలో కూడా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రాలతో సీఎంను సన్మానించి, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అర్చకులు తీర్థప్రసాదం అందించి ఆశీర్వచనం చేశారు. సీఎం రాకతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. అక్కడి నుంచి కాటారం మండలంలోని నస్తూరిపల్లి లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.


Discover more from janamvoice.com

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -spot_img
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!

Subscribe