సిర్పూర్-కాగజ్‌నగర్ రైలులో మంటలు.
- బీబీనగర్ సమీపంలో ఘటన.
- చక్రం రాపిడితో చెలరేగిన మంటలు.
- అప్రమత్తమైన సిబ్బందితో తప్పిన ముప్పు.
- ప్రయాణికులకు ఎలాంటి గాయాలు లేవు.
జనం వాయిస్,యాదాద్రి భువనగిరి,అక్టోబర్7:
సిర్పూర్-కాగజ్‌నగర్ వెళ్లే రైలులో బుధవారం స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రైలు ఓ బోగీ చక్రానికి బ్రేక్ లైనర్ పట్టేయడంతో ఏర్పడిన రాపిడి కారణంగా పొగలు, మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. రైలు బీబీనగర్ స్టేషన్ సమీపానికి చేరుకుంటున్న సమయంలో చక్రం నుంచి పొగలు రావడాన్ని కో-పైలట్ గమనించారు. వెంటనే లోకో పైలట్‌కు సమాచారం అందించడంతో రైలును బీబీనగర్ రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. అప్రమత్తంగా వ్యవహరించడంతో మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా నివారించగలిగారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. అనంతరం సాంకేతిక సిబ్బంది బోగీని పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపట్టారు. మరమ్మతులు పూర్తయిన తర్వాత రైలును తిరిగి సిర్పూర్-కాగజ్‌నగర్ వైపు పంపించారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.
Discover more from janamvoice.com
Subscribe to get the latest posts sent to your email.




Recent Comments